ఈ రోజు చాలా తెలుగు బ్లాగులు చూసి నాకు కూడా తెలుగులో ఒక బ్లాగు మొదలుపెట్టాలనిపించింది. ఇది ఎన్ని రోజులు క్రమంగా కొనసాగిస్తానో నాకే అనుమానంగా ఉంది. మొన్ననే కొత్తగా గూగుల్ గ్రూపులలోని తెలుగు గ్రూపును చూసి ఇంట్రెస్టింగ్ గా అనిపించి వెంతనె అందులొ చేరిపోయాను. అందులో ఉన్న వాళ్ళ బ్లాగులు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత చక్కగా రాస్తున్నరు!!! అందరు నాలాగా ఇరవైలలొ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు.....నలబైయ్యొవ వడిలొ ఉన్న వాళ్ళు, యాబైయ్యొవ వడిలొ ఉన్న వాళ్ళు.....ఇలా ఎందరో....అంతా బాగానే ఉంది కాని, నా మదిని తొలచివేస్తున్న ప్రశ్న ఒకటి ఉంది....ఇంత మందికి రోజూ అంత అంత పెద్ద బ్లాగులు రాయడానికి సమయం ఎక్కడినుండి దొరుకుతుందా అని....
నాకు కూడా రోజూ రాయాలని ఉంది....రోజూ కాకపొయినా కనీసం రెగులర్ గా అయినా సరే....కాని ఈ సాఫ్టువేర్ జీవితంలొ కొంచెం తీరిక దొరికినా కూడా రెస్ట్ తీసుకోవడనికే చూస్తాం కదా....
అబ్బో.....మొదటి సారి తెలుగులొ ఇంత విషయం ఒకేసారి టైపు చేస్తున్నను...కొంచెం కస్టంగానే ఉంది....కానే ఇస్టంగా చెస్తే కస్టం తెలేదు కదా...
ఎంత పెద్ద పెద్ద ఇంగ్లీషు చదువులు చదివినా, మాతృభాషలో భావవ్యక్తీకరణకు మించినది ఏమి ఉంటుండి చెప్పండి....
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
బ్లాగ్లోకానికి స్వాగతం!
స్వాగతం!
బ్లాగులోకానికి స్వాగతం. క్రమంతప్పకుండా వ్రాయాలనే మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను.
సుస్వాగతం.బ్లాగు కొనసాగుతుందా అని సందేహం వద్దు. ఎందుకంటే ఒక్క సారి కూడలి లో అడుగుపెడితే దాని నుంచి ఎలా బయటపడాలా అని మీరే ఆలోచించేంత వ్యసనంగా తెలుగు బ్లాగింగు మీకు అనిపించవచ్చు. :-)
మీరు చివరిగా చెప్పినా వాక్యాలు చాల నచ్చాయి.
మీరు తెలుగులో బాగా రాయటానికి...
01. lekhini.org
02. baraha IME (baraha.com)
03. http://quillpad.in/telugu
గానీ వాడవచ్చు.
స్వాగతం.సుధాకర్‌గారు చెప్పింది నిజం... ఇది ఒక మధురమైన వ్యసనం.
సుస్వాగతం!... సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు పెద్దలు,ఇదీ అంతే!మీ అంతరంగాలు ఉధృత తరంగాలై మన బ్లాగ్లోకాన్ని ముంచెత్తాలని ఆశిస్తూ...
బ్లాగ్లోకానికి సుస్వాగతం.
స్వాగతం. మాత్రుభాషలో భావవ్యక్తీకరణ కంటే మించిన ఆనందం ఏముంటుందన్నారు. మీతో రాయించేందుకు ఈ భావన చాలు. క్రమం తప్పకుండా రాయకపోతే బ్లాగావరణంలో ఎవరేమనుకుంటారో అని ఒత్తిడికి లోనుకాకండి. రెండు నెలలకొకటి రాసినా క్రమమేగా. నేను నెలకొకటి రాస్తుంటానంతే. అదికూడా నాకునేనుగా గానీ, మరెవరైనాగానీ విధించిన నిబంధనేమీ కాదు. కూడలి వ్యసనపరుడనై, ఇప్పుడు కొంతకాలంపాటు బ్లాగులకు దూరంగా ఉందామనుకొంటున్నాను కూడా. కానీ అది సాధ్యపడేలా లేదు.
ఒక్కసారి మొదలు పెడితే ఆగడం ఉండదు.అందులోను కూడలి తెలిసాకా అస్సలు వుండలేము.నావరకు అయితే బ్లాగురాయడమే ఎక్కువ త్రుప్తినిస్తుంది.కూడలిలో సేద తీరుతుంటాను.జ్యొతి గారన్నట్టు ఇదొక మధురమయిన వ్యసనం.
స్వాగతం! ముందు బ్లాగేందుకు సమయం దొరకదు. తరువాత దానికిచ్చిన సమయం చాలదు. ఆపై మిగతా వాటికి సమయం దొరకదు.జాగ్రత్త సుమండీ!
సుధాకర్ గారు చెప్పినట్లు మీ ముగింపు వాక్యాలు బాగా నచ్చాయి.
తెలుగులో వ్రాయడానికి మైక్రోసాఫ్ట్ ఫొనెటిక్ ఇన్ పుట్ టూల్ ని కూడా వాడవచ్చు. ట్రై చెయ్యండి.
సాధనమున పనులు సమకూరు ధరలోన!
శుభం భూయాత్!
Post a Comment