Monday, February 26, 2007

క్షమించాలి.....నిన్న నా పోస్టు ఏదో excitement లో రాసినది.....

నేను గూగుల్ని ఎందుకు గ్రేట్ అన్నానో అది చదివిన వారికి అర్ధం అయి ఉండక పోవచ్చు....అది సహజమే.... బ్లాగు చదివిన ఒక Anonymous పాఠకుడు విషయాన్నే ప్రస్తావించాడు...ఇదిగో ఇదండీ దానికి కారణం.....

నాకు ఇంగ్లీషులో బాగా నచ్చిన, బాగా అనుభవించిన కోట్... Necessity is the mother of invention

మా ఆఫీసులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటికి ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఇస్తారు....ఇంక చెప్పేదేముంటుంది....అన్ని మెయిల్స్ కూడా బ్లాక్డ్... అందుకే నా నుంచి గ్రూపుకు ఎక్కువగా రావు.(ఎక్కువ ఏంటి...ఇప్పటి వరకు ఒకటో రెండో వచ్చి ఉంటాయి) ఇలాంటప్పుడే కదా, మనలోని క్రియేటివిటీ బయటకు తన్నుకొస్తుంది కదా....!

గొడవంతా ఎందుకు గానీ నిన్న ఎందుకు అలా గూగుల్ని పొగిడానో చెప్తాను, వినండి.....కాదు కాదు ...చదవండి...!

ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి ఆటోసేవ్ గురించిన డిస్కషన్ జరుగుతుంది కదా.... నిన్న సుధాకార్ గారు ఒక మెయిల్ పంపారు చూడండి..!

అందులో www.baraha.com గురించి చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది.

http://www.baraha.com/download/BarahaIMESetup.zip నుంచి దాన్ని డౌన్లోడ్ చేసి నా సిస్టంలో ఇన్స్టాల్ చేసాను. దీనిని ఉపయోగించి బ్రౌసర్ లో మాత్రమే కాకుండా, అప్లికేషన్ లోనైనా ఉపయోగించవచ్చు. పైగా F11 కీ ఉపయోగించి ఇంగ్లీషులోకి, తెలుగులోకి ఈజీగా మారవచ్చు....

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా....ఇప్పుడు ఆటోసేవ్ గురించి చూద్దాం.

అందరికి గూగుల్ ఎకౌంటు ఉండే ఉంటుంది కద...సో గూగుల్ వారు కొత్తగా Google Docs & Spreadsheets అనేది మొదలు పెట్టారని అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ GMail లో లాగానే ఆటోసేవ్ ఆప్షన్ ఉంది.

అయితే మీరు అడగవచ్చు, ఇది జీమెయిల్ లో ఉంది కదా....దీని గొప్ప ఏంటి అని.....!

ఇక్కడ ఉన్న అదనపు సౌకర్యం ఏంటంటే, ఇక్కడ నుండి మీ బ్లాగులోనికి డైరెక్ట్ గా పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీనిని అలాగే పోస్ట్ చేయబోతున్నానండోయ్...

కాబట్టి డౌన్లోడ్ చేసుకొని, గూగుల్ అకౌంట్ ఉంటే మీరు కష్టపడి టైపు చేసినది కరంటు పొవడం వల్లనో, మరేదో దాని వల్లనో వృధాగా పోకుండా ఉంటుందని నా సూచన. దీనితో మనందరి Autosave Problems ki తెర పడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు. నా సూచన మీద మీ మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను.

అదండీ Mr.Anonymous గారూ...అందుకే గూగుల్ ఈస్ గ్రేట్ అన్నాను. ఒప్పుకుంటారా మరి!!!

2 comments:

Anonymous said...

Google has bought a company called "Writely" which has developed everything that is there in Google docs as of now. Google simply branded it as Google docs. Google is great in buying good things.

Young Buzzer said...

yeah...dats rite...
if u had an account in "Writely", and some documents there, u can just get them into ur google account with jus a single click.
You r quite rite in saying dat "Google is great in buying good things", like youtube recently..!